calender_icon.png 8 May, 2025 | 5:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి.. మరొకరికి తీవ్ర గాయాలు

07-05-2025 11:09:42 PM

ఆదిలాబాద్ (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. గంగన్న, సునీల్ అనే వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా తిర్పెల్లి కాలనీలోని హిందీ హై స్కూల్ ఎదురుగా పాత జాతీయ రహదారిపై బుధవారం రాత్రి ఎదురుగా వస్తున్న మ్యాక్స్ వాహనం ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో గంగన్న అక్కడికక్కడే మృతి చెందగా, సునీల్ కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే 108 సిబ్బంది గాయపడ్డ వ్యక్తి ని రిమ్స్ కు తరలించారు. ఈ మేరకు పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి మృత్బుదేహాన్ని రిమ్స్ మార్చురీకి తరలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.