10-05-2025 06:08:04 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని పెన్షనర్ల భవనంలో ఆదివారం కలం స్నేహం సొసైటీ ఆధ్వర్యంలో మాతృభాషా దినోత్సవం నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు కడారి దశరథ్ కొండూరి పోతన్న దేవిప్రియలు తెలిపారు. సాయంత్రం ఐదు గంటలకు నిర్వహించే మాతృభాషా దినోత్సవంలో మాతృభాష ప్రాధాన్యతపై కవులు, కళాకారులు తన రచనలు అభిప్రాయాలను తెలపడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు.