calender_icon.png 10 May, 2025 | 10:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం... తల్లి కూతుళ్ల దుర్మరణం

10-05-2025 05:48:28 PM

జుక్కల్,(విజయక్రాంతి): జుక్కల్ మండలంలోని పెద్దగుళ్ల తండాలో శనివారం ఉదయం ఇంట్లో ఉన్న కూలర్ కు విద్యుత్ షాక్ తగిలి తల్లి కూతుర్లను దుర్మరణం చెందిన సంఘటన గ్రామస్తులను కలిచివేసింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం తల్లి కాంషాబాయి, (30) కూతురు శివనీ (12) ఉదయం లేవగానే కూలర్ ను ఆఫ్ చేయడానికి వెళ్లినప్పుడు కరెంట్ షాక్ తగిలి మృతి చెందినట్లు వారు తెలిపారు. గత వారం రోజుల నుంచి గ్రామంలో ఎవరి ఇంట్లో చూసినా ఏ వస్తువును ముట్టుకున్న విద్యుత్ షాక్ తగులుతుందని గ్రామస్తులు పేర్కొన్నారు.

ఈ విషయం ఎన్నోసార్లు విద్యుత్ శాఖ అధికారులకు తెలిపినప్పటికీ వారు పట్టించుకోలేదని చెప్పారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల రెండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయని కుటుంబీకులు రోధిస్తున్నారు. దీంతో గ్రామంలో విషాదాఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న జుక్కల్ పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి పంచనామా నిర్వహించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.