calender_icon.png 10 May, 2025 | 11:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దశాబ్ది ఉత్సవాలు.. ఉత్సాహంగా సాగిన నడక పోటీలు

10-05-2025 06:02:30 PM

బెల్లంపల్లి అర్బన్,(విజయక్రాంతి):  తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని పాత బెల్లంపల్లిలోని నీలగిరి ప్లాంటేషన్లో శనివారం ఐదు కిలోమీటర్ల నడక పోటీలు నిర్వహించారు. "వనంలో మనం- ఆరోగ్యం కోసం నడక" అనే పిలుపుతో అటవీ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో సాగిన ఈ పోటీలను కాగజ్ నగర్ డివిజనల్ మేనేజర్ శ్రీశ్రావణి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పచ్చని చెట్ల మధ్య నడక పోటీలు ఆరోగ్యంతో పాటు మానసిక ఉత్సాహాన్ని కలిగిస్తాయన్నారు.

ఈ నడక పోటీలకు పాత బెల్లంపల్లి, సోమగూడెం  ప్రాంతాలకు చెందిన వారు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ నడక పోటీలలో ఎస్ కిరణ్ (ప్రథమ), సిహెచ్ అఖిల్  (ద్వితీయ), జంపం తిరుపతి (తృతీయ) విజేతలుగా నిలిచారు. పోటీల్లో ప్లాంటేషన్ మేనేజర్లు వి.సునీత (బెల్లంపల్లి రేంజ్), గోగు సురేష్ కుమార్ (మంచిర్యాల రేంజ్), ఎడ్ల లక్ష్మణ్ (కాగజ్ నగర్ రేంజ్),  డిప్యూటీ ప్లాంటేషన్ మేనేజర్ జె నరేష్, పాత బెల్లంపల్లి మాజీ సర్పంచ్ జయ రామస్వామి, స్థానిక పెద్దలు కందుల సదానందం, మేకల పవన్, రాజు పాల్గొన్నారు.