calender_icon.png 1 November, 2025 | 6:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సుల్తానాబాద్ సాంబశివాలయంలో ఘనంగా ఏకాదశి వేడుకలు

01-11-2025 03:36:52 PM

పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు

సుల్తానాబాద్,(విజయక్రాంతి): కార్తీక మాసం శుక్లపక్షం ప్రబోధిని ఏకాదశి సందర్భంగా పంచరత్నాలలో భాగంగా మొదటి రోజున శనివారం సుల్తానాబాద్ పట్టణంలోని  శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ ఆవరణలోని శ్రీ సాంబశివ ఆలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించడం జరిగింది. స్వామివారికి రుద్రాభిషేకం, పంచామృత అభిషేకాలు నిర్వహించారు. అనంతరం కార్తీక జ్యోతితో నగర సంకీర్తన జరిపారు. ఈ సందర్భంగా అర్చకులకు భక్తులు దీపదానాలు చేశారు.

ఆలయ అర్చకులు పారువెల్ల రమేష్, సాయి ప్రణవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ కమిటీ చైర్మన్ పల్లా మురళీధర్, డైరెక్టర్ ముస్త్యాల శ్రీదేవి రవీందర్, శ్రీ శివాలయం కమిటీ చైర్మన్ అల్లెంకి  సత్యనారాయణ, అర్చకులు వల్లకొండ మహేష్ , ఓదెల దేవస్థానం ధర్మకర్తల మండలి డైరెక్టర్ సామల యమున హరికృష్ణ , సింగిల్ విండో డైరెక్టర్ కూకట్ల ఓదెలు, బండి రామ్మోహన్, రామిడి రవీందర్  పెద్ద సంఖ్యలో మహిళలు, భక్తులు పాల్గొన్నారు. ఓదెల దేవస్థానం డైరెక్టర్ గా నియామకమై మొదటిసారి సాంబశివ దేవాలయం కు వచ్చిన  సామల యమున హరికృష్ణ దంపతుల కు ఈ సందర్భంగా శ్రీ సాంబశివ ఆలయ అర్చకులు పారువెల్ల రమేష్ శర్మ స్వామి వారి శేష వస్త్రం అందజేసి... ఆశీర్వచనాలు అందజేశారు.