04-11-2025 08:35:09 PM
మండల వ్యవసాయాధికారి గణేష్..
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి): రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర కల్పించేందుకే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని మండల వ్యవసాయాధికారి పెందోట గణేష్ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని అర్వపల్లి, బొల్లంపల్లి గ్రామాలలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి మాట్లాడారు. రైతులు కనీస ప్రభుత్వ మద్దతు ధర పొందాలంటే నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. చెడిపోయిన, రంగు మారిన, మొలకెత్తిన ధాన్యం 5 శాతం మించకూడదని, తేమ 17 శాతం మించి ఉండకూడదని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ శోభారాణి, ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, రైతులు, హమాలీలు తదితరులు పాల్గొన్నారు.