calender_icon.png 4 November, 2025 | 1:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

04-11-2025 12:00:00 AM

మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి 

చివ్వెంల, నవంబర్ 3: ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతుల సద్వినియోగం చేసుకోవాలని సూర్యాపేట మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి అన్నారు. మండలంలోని మొగ్గాయిగూడెం, చందుపట్ల, బీబీ గూడెం గ్రామాల్లో కొత్తగా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సోమవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వం నిర్ణయిం చిన గిట్టుబాటు ధరలు పొందేందుకు రైతులు నాణ్యమైన ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకురావాలని  కోరారు.

అలాగే ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ధారవత్ వీరన్న నాయక్, పార్టీ నాయకులు గాయం చంద్రశేఖర్ రెడ్డి, అనిత, కోడిరెక్క కొండల్, గుద్దేటి వెంకన్న, బొడుపుల హరికృష్ణ, ముద్ద వెంకన్న, అనంతుల సైదులు తదితరులు పాల్గొన్నారు.