22-05-2025 01:15:01 AM
జిల్లా అదనపు కలెక్టర్ నర్సింగ రావు
గద్వాల, మే 21 ( విజయక్రాంతి ) : వరి ధాన్యం సేకరణలో జాప్యానికి తావు లేకుండా పకడ్బందీగా చర్యలు చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్ నర్సింగ రావు అధికారులకు ఆదేశిం చారు.బుధవారం గద్వాల మండలం లత్తిపురం గ్రామములో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగో లు కేంద్రాన్ని అయన పరిశీలించారు.
కొనుగోలు కేంద్రంలో రైతులకు ఎలాంటి అసౌకర్యం కలవకుండా అన్ని సదుపాయాలు కల్పించాలన్నారు. ధాన్యం సేకరణ ప్రక్రియలో భాగంగా నాణ్యత పరీక్ష, సదుపాయాలు, తూగిన తరువాత రసీదు అందజేత వంటి అంశాలపై అధికారులను అ డిగి తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద వర్షంలో ధాన్యం తడవకుండా అవసరమైన తాడిపత్రి, గొనే సంచులు తదితర సదుపాయాల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, పూర్తిగా పారదర్శకంగా,నిర్దిష్టమైన మార్గదర్శకాలకు అనుగుణంగా ధాన్యం కొనుగోలు వేగవంతంగా చేపట్టి పూర్తిచేయాలని సంబంధిత అధికారులను ఆదేశించా రు. ప్రతి రైతుకు ధాన్యం తూగిన వెంటనే బిల్ జారీ చేసి సకాలంలో డబ్బులు అందే విధంగా చూడాలని తెలిపారు.అనంతరం ముల్కలపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ కార్యక్రమంలో కొనుగోలు కేంద్రం నిర్వాహకులు, సంబంధిత అధికారులు,పాల్గొన్నారు.