05-12-2025 10:14:02 PM
- బెల్లంపల్లి లో ఘటన
- రూ. 5 వేలు ఇస్తూ పట్టుబడిన కార్యదర్శ
- ఇందిరమ్మ బిల్లు కోసం రూ.10 వేలు లంచం
బెల్లంపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో పంచాయతీ కార్యదర్శి రాజ్ కుమార్ ఏసీబీకి చిక్కిన ఘటన కలకలం రేపింది. ఆదిలాబాద్ ఏసీబీ డీఎస్పీ జి మధు తెలిపిన వివరాల ప్రకారం... కన్నెపల్లి పంచాయితీ కార్యదర్శి గొల్లపల్లి రాజ్ కుమార్ అదే గ్రామానికి చెందిన ఓ ఇందిరమ్మ లబ్ధిదారుడికి ఇంటి బిల్లు చెల్లించడానికి రూ.10000 లంచం అడిగాడు. అంత పెద్ద మొత్తంలో ఇవ్వలేని ని సదరు లబ్ధిదారుడు కార్యదర్శి తో మొరపెట్టుకున్నాడు.
చివరికి రూ.5000 ఇస్తానని చెప్పడంతో అందుకు పంచాయతీ కార్యదర్శి రాజ్ కుమార్ అంగీకరించాడు. రూ. 5000 పంచాయతీ కార్యదర్శి రాజ్ కుమార్ కి ఇవ్వడానికి ఇందిరమ్మ లబ్ధిదారుడు బెల్లంపల్లి కాంట అంబేద్కర్ చౌరస్తా కు వచ్చాడు. లబ్ధిదారుడినీ నుంచి. లంచంగా రూ 5000 తీసుకుంటుండగా రాజకుమార్ ను ఏసీబీ డిఎస్పి మధు తన బృందంతో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ సంఘటన బెల్లంపల్లిలో సంచలనంగా మారింది. పంచాయతీ కార్యదర్శి రాజ్ కుమార్ ఏసీబీకి పట్టుబడిన సంఘటన ప్రభుత్వ అధికారుల్లో వణుకు పుట్టించింది.
అధికారులకి లంచం ఇవ్వకండి..
లంచం తీసుకుంటుండగా పంచాయతీ కార్యదర్శిని రాజ్ కుమార్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ డీఎస్పీ మధు ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. అధికారులు ఎవరైనా లంచం అడుగుతే తమ దృష్టికి తీసుకు రావాలని కోరారు. ఎవరికీ లంచం ఇవ్వాల్సిన అవసరం లేదని అన్నారు. అధికారులు లంచo అడిగితే ఇవ్వద్దని చెప్పారు. లంచగొండి అధికారులపై నిర్భయంగా తమకు సమాచారం ఇవ్వాలని ఆయన పురోద్ఘాటించారు.