calender_icon.png 6 August, 2025 | 11:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉద్యమాలకు ఊపిరి పోసిన ప్రజా గాయకుడు గద్దర్..

06-08-2025 08:30:20 PM

నివాళులర్పించిన మాల సంఘం నేతలు..

అదిలాబాద్ (విజయక్రాంతి): మాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో యుద్ధనౌక, ప్రజా గాయకుడు గద్దర్ ద్వితీయ వర్ధంతిని జిల్లా మాల సంక్షేమ సంఘం భవనంలో నిర్వహించారు. ఈ సందర్భంగా గద్దర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ మేరకు సంఘం జిల్లా అధ్యక్షుడు కొప్పుల రమేష్(District President Koppula Ramesh) మాట్లాడుతూ, గద్దర్ అనగారిన వర్గాల అభ్యున్నతి కోసం తన ఉద్యోగాన్ని వదులుకొని తన విప్లవ గేయాలతో ప్రజలందరిలో ఉద్యమ భావాలను నింపరన్నారు. ఎన్నో ఉద్యమాలు చేసి ప్రజా గాయకకుడిగా పేరుగాంచినట్లు ఆయన సేవలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ పేరుతో గద్దర్ అవార్డులను ప్రధానం చేస్తుందని, ఇందుకు ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదములు తెలుపుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంనందు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మేకల మల్లన్న, అసోసియేషన్ అధ్యక్షుడు పాశం రాఘవేంద్ర, సంయుక్త కార్యదర్శి ముల్కల రాజేశ్వర్, సీనియర్ నాయకులు బేర దేవన్న, మహేంద్ర స్వామి, నరేందర్, సింగర్ అశోక్, తదితరులు పాల్గొన్నారు.