calender_icon.png 6 August, 2025 | 11:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తహసీల్దార్ మృతికి సంతాపం

06-08-2025 08:33:39 PM

మందమర్రి (విజయక్రాంతి): జిల్లాలోని నెన్నెల మండల తహసీల్దార్ జ్యోతి(Tahsildar Jyoti) అకాల మృతి పట్ల మండల తహసీల్దార్ సతీష్ కుమార్ సంతాపం ప్రకటించారు. తహసీల్దార్ కార్యాలయంలో బుధవారం కార్యాలయం సిబ్బందితో కలిసి తహసీల్దార్ మృతి పట్ల సంతాపం ప్రకటిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించి ఆమే ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ సతీష్ కుమార్ మాట్లాడుతూ, జిల్లాలోని వివిధ మండలాల్లో తహసీల్దార్ గా విధులు నిర్వహించిన జ్యోతి జిల్లా ప్రజలకు సేవలందించి ప్రజల మనలను చూరగోన్నారని ఆమె సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో కార్యాలయం అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.