calender_icon.png 13 May, 2025 | 11:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం

12-05-2025 02:05:54 AM

నారాయణపేట. మే 11(విజయక్రాంతి):  గుండుమల్ మండల కేంద్రంలో  పీఎస్ సు నంద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్   ఆధ్వర్యం లో  ఉచిత ఎముకల, కీళ్ళ వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది.  బిఎండి టెస్ట్ నిర్వ హించి, ఉచితంగా మందులు పంపిణీ చే యడం జరిగింది.

హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ప్రసాద్ శెట్టి  మాట్లాడుతూ ప్రజ లకు మెరుగైన వైద్యం అందించడమే తమ లక్ష్యమని ఈ విధంగా ఉచితంగా క్యాంపులు నిర్వహించి ప్రజలకు వైద్యం పట్ల అవగాహన కల్పిస్తామని అన్నారు.

ఈ  కార్యక్ర మంలో  జిల్లా గ్రంథాలయ చైర్మన్ విజయ్, మాజీ ఎంపీపీ మధుకర్ రావు గారు, మాజీ జెడ్పిటిసి ప్రకాష్ రెడ్డి, విక్రం రెడ్డి, సురేష్ రెడ్డి, సాయిలు, రవీందర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, పిఎస్ సునంద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.