డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్‌కు ఘన సన్మానం
కామారెడ్డి, ఏప్రిల్ 1 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం డిసిసి అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ ని ఘనంగా సన్మానించారు. కామారెడ్డి మున్సిపాలిటీ నూతన చైర్మన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ తమ పాలకవర్గ కౌన్సిలర్లతో కలిసి కార్యాలయానికి విచ్చేసి డిసిసి అధ్యక్షులు మల్లికార్జున్ కి మెమొంటోను అందజేశారు. ఈ సందర్భంగా నూతన పాలకవర్గానికి చెందిన కౌన్సిలర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సంఘీభావాన్ని వ్యక్తం చేశారు.
జిల్లా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ చేస్తున్న కృషిని ప్రశంసిస్తూ, ఆయన నాయకత్వంలో పార్టీ మరింత బలపడాలని ఆకాంక్షించారు. కామారెడ్డి జిల్లాలో అన్ని మండలాల్లో కాంగ్రెస్ మరింత పటిష్టవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ ఇప్ప ఉమారాణి, శ్రీనివాస్, కాంగ్రెస్ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.




