16 August, 2026 | 2:28 AM

జాతీయ జెండాకు అవమానం

16-08-2026 12:00 AM

ఇటిక్యాల ఐకేపీ కార్యాలయంలో తలకిందులుగా ఎగురవేత

ఇటిక్యాల, ఆగస్టు 15: జాతీయ జెండాను గద్వాల జిల్లా ఇటిక్యాల మండల ఐకేపీ కా ర్యాలయంలో తలకిందులుగా ఎగురవేయ డం వివాదాస్పదంగా మారింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని ఎగురవేసిన అధికారులు, పతాకంలోని కా షాయ రంగు పైభాగంలో ఉండాల్సిన విషయాన్ని పట్టించుకోకపోవడంతో జెండా తల కిందులుగా కనిపించింది.

ఆశ్చర్యకరంగా, అ క్కడే ఉన్న ఏపీఎంతో పాటు ఇతర అధికారులు తలకిందులుగా ఉన్న జాతీయ జెండా కు సెల్యూట్ చేయడం స్థానికుల్లో ఆగ్రహానికి కారణమైంది. జాతీయ జెండా ఎగురవేత విషయంలో కనీస నిబంధనలు, జాగ్రత్తలు పాటించకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని స్థానికులు విమర్శించారు.