16-10-2025 07:13:21 PM
రైతుల ఆర్థికాభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్న ప్రభుత్వం
తంగళ్ళపల్లి (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి సారంపల్లి గ్రామంలో ఇందిరా క్రాంతి పథకం ఆధ్వర్యంలో మహిళా సంఘాల సమన్వయంతో వడ్ల కొనుగోలు కేంద్రాలను ఏఎంసి చెర్మెన్ వెలుపుల స్వరూప తిరుపతిరెడ్డి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల శ్రమకు సరైన విలువ దక్కేలా ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతుందని తెలిపారు. రైతుల ఆదాయాన్ని పెంచడంలో ఈ కొనుగోలు కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. స్వరూప తిరుపతిరెడ్డి మాట్లాడుతూ, “మహిళా సంఘాల ద్వారా వడ్ల కొనుగోలు కేంద్రాలు నడపడం గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి దోహదం చేస్తుంది. రైతుల సమస్యలు లేకుండా ధాన్యం కొనుగోలు జరుగేలా పర్యవేక్షణ ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ నేరెళ్ల నర్సింగం, ఏపిఎం రంజిత, డైరెక్టర్ తిరుపతి రెడ్డి, రాములు, నరసయ్య, సత్తు శ్రీనివాస్ రెడ్డి, మునిగేల రాజు, శ్రీనివాస్, రైతులు, మహిళా సంఘ సభ్యులు పాల్గొన్నారు. రైతులు ప్రభుత్వం చేపడుతున్న కొనుగోలు విధానంపై సంతృప్తి వ్యక్తం చేస్తూ, ఏఎంసి చైర్మన్‌కి కృతజ్ఞతలు తెలిపారు.