27 August, 2026 | 1:31 AM

ఘనంగా మిలాద్- ఉన్-నబీ ర్యాలీ

27-08-2026 12:00 AM

పాల్గొన్న ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

జడ్చర్ల, ఆగస్టు 26: మున్సిపాలిటీలో ముస్లిం సోదరులు నిర్వహించిన పవిత్ర మిలాద్-ఉన్-నబి ర్యాలీలో జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు మిలాద్-ఉన్-నబి శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే, మహమ్మద్ ప్రవక్త బోధించిన శాంతి, సోదరభావం, ప్రేమ, సహనం, మానవత్వం వంటి విలువలు సమాజానికి స్ఫూర్తిదాయకమని అన్నారు.

ప్రతి ఒక్కరూ పరస్పర గౌరవం, ఐక్యతతో ముందుకు సాగుతూ జడ్చర్ల నియోజకవర్గ అభివృద్ధికి, సమాజంలో శాంతి సౌభ్రాతృత్వాల పరిరక్షణకు కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు  కార్యకర్తలు, ముస్లిం మత పెద్దలు,యువత, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.