జయశంకర్ సార్‌కు ఘన నివాళి
హైదరాబాద్, ఆగస్టు 6 (విజయక్రాంతి): ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ జయం తి సందర్భంగా తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం ఖమ్మం అధ్యక్షులు కొంగర వెంకటేశ్వరరావు, కార్యదర్శి మోదుగు వేలా ద్రి ఆధ్వర్యంలో గురువారం గెజిటెడ్ భవన్ లో ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు. జయశంకర్ చిత్రపటానికి పూలమా లలు వేసి నివాళులర్పించారు.
అధ్యక్షులు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమానికి మేధోబలాన్ని అందించిన గొ ప్ప విద్యావేత్త, ఆర్థికవేత్త, దూరదృష్టి గల ఆ లోచనాపరుడు ప్రొఫెసర్ జయ శంకర్ అని కొనియాడారు. మోదుగు వేలాద్రి మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం స్వా భిమానాన్ని ప్రపంచానికి చాటి చెప్పడంలో ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు.
ఎస్‌జీపీఏ జిల్లా అధ్యక్షులు పరిష పుల్లయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వెనుక ఉన్న చారిత్రక, సామాజిక, ఆర్థిక కారణాలను శాస్త్రీయంగా విశ్లేషించి, ప్రత్యేక రాష్ట్ర అవసరాన్ని దేశవ్యాప్తంగా వినిపించిన మహనీయుడు జయశంకర్ అని అన్నారు.
ఎస్‌జీపీఏ కార్యద ర్శి రవి, టీజీవో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, కొండపల్లి శేషు ప్ర సాద్, హౌస్ బిల్డింగ్ సొసైటీ కార్యదర్శి డా. పి విజయ్ కుమార్, జిల్లా కోశాధికారి సూ రంపల్లి రాంబాబు, కార్యవర్గ సభ్యులు దేశభైనా అరుణ్ కుమారి, మోదుగు వెంకటేశ్వ ర్లు, ఇంటూరి భాస్కర్, ఏడిఏ సతీష్, ఏ డీఏ నారాయణరావు, నాలుగో తరగతి ఉ ద్యోగ సంఘ నేతలు గఫూర్ నివాళులర్పించారు.






