ఎమ్మెల్యే శ్రీగణేష్ జన్మదిన వేడుకలు
హైదరాబాద్, ఆగస్టు 6 (విజయక్రాంతి): సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ గురువారం తన జన్మదినాన్ని పురస్కరించుకుని నియోజకవర్గ వ్యాప్తంగా సామాజిక, సేవా, అభివృద్ధి కార్యక్రమాలను నిర్వ హించారు. తన నివాసంలో దివ్యాంగులకు కుట్టు మిషన్ పంపిణీ చేశారు. తుకారాం గేట్‌లోని శ్రీ సాయి బాబా ఆలయంలో పూజలు చేశారు. అడ్డగుట్ట డివిజన్‌లో ఉచిత మెగా హెల్త్ క్యాంప్‌ను ప్రారంభించారు.
మా రేడుపల్లిలోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించి విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి మొక్కను నాటారు. బోయిన్‌పల్లి ఎయిర్‌పోర్టు రోడ్‌లోని మౌంట్ కార్మెల్ చర్చ్ ఆర్చ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. కా ర్ఖానాలోని ఆర్కే ఫౌండేషన్ ఆధ్వర్యంలో, పి క్కెట్ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన అన్నదా న కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మారేడుపల్లిషెనాయ్ గ్రౌండ్స్‌లో ఆలయాల అర్చకులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. యు వతకు క్రికెట్ కిట్లను అందజేశారు.






