యువతకు ఉపాధి కల్పించడం నా బాధ్యత
- 9న నిజామాబాద్‌లో మెగా జాబ్ మేళా
- 2 వేలకు పైగా ఉద్యోగాలు
- అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ
హైదరాబాద్, ఆగస్టు 6 (విజయక్రాంతి): యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం ప్రజాప్రతినిధిగా నా బాధ్యత అని అర్బన్ ఎమ్మె zల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 9వ తేదీన జిల్లా కేంద్రంలోని ఆర్మూర్ రోడ్ లో గల శ్రీరామ గార్డెన్‌లో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఇందులో 60కి పైగా ప్రముఖ జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు పాల్గొంటున్నాయని తెలిపారు.
ప్రధానంగా 2 వేల కు పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. పదో తరగతి, ఇంటర్మీడియట్, ఐటి ఐ, డిప్లమా, డిగ్రీ, బీటెక్, పీజీ తదితర విద్యార్హతలు కలిగిన యువతీ యువకులు అవకా శాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
పరిశ్రమలకు నిరుద్యోగులకు మధ్య వారధిగా నిలిచి స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకే ఈ మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు. అర్హత కలిగిన ప్రతి అభ్యర్థి బయోడేటా వి ద్యార్హతల ధ్రువపత్రాల ప్రతులు, ఆధార్ కార్డు పాస్పోర్ట్ సైజు ఫోటోలతో ఉదయం 9 గంటల నుంచి హాజరుకావాలని కోరారు.






