23 June, 2026 | 1:36 AM

బీఆర్‌ఎస్ సీనియర్ నాయకురాలి మనువడి మృతి

23-06-2026 12:00 AM

సానుభూతి తెలిపిన మాగంటి సునీత గోపీనాథ్

జూబ్లీహిల్స్, జూన్ 22 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకురాలు ఇంద్రాణి మనువడు గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. అందుకు సంబంధించిన చికిత్సను పొందుతూ సోమవారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న జూబ్లీహిల్స్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ ఇంచార్జి మాగంటి సునీత వారి నివాసానికి వెళ్లారు. పార్థివ దేహానికి పూలమాలను వేసి నివాళులర్పించారు. ఇంద్రాణి మనువడి మృతి పట్ల సంతాపాన్ని ప్రకటించారు.

కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. భగవంతుడు వారికి దు:ఖాన్ని తట్టుకునే ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థించారు. సునీత గోపీనాథ్ వెంట బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు సల్ల శ్రీనివాస్ యాదవ్, అమ్మాజీ, నాగరాజు, నవీన్ పోగుల, చిన్నా యాదవ్, స్రవంతి, హసన్, రవి, కళ్యాణ్, శ్రవణ్ తదితరులున్నారు.