calender_icon.png 3 November, 2025 | 9:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పట్టణంలో సమాధుల పండుగ

02-11-2025 10:22:11 PM

మందమర్రి (విజయక్రాంతి): పట్టణంలోని సింగరేణి హై స్కూల్ వెనకాల గల క్రైస్తవ స్మశాన వాటికలో క్రైస్తవులు ప్రతి ఏటా జరుపుకునే సమాధుల పండుగ(ఆల్ సోల్స్ డే)ను ఆదివారం ఘనంగా నిర్వహించారు. మృతిచెందిన తమ బంధువుల సమాధులను రంగురంగు పువ్వులతో అలంకరించి, కొవ్వొత్తులతో ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధనలు చేశారు. అనంతరం సీఎస్ఐ చర్చి పాస్టర్ రెవరెండ్ జెర్మీయా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు సునీల్ కుమార్, రాజశేఖర్, పద్మారావు, సామ్యూల్, క్రాంతికిరణ్, క్రిస్టఫర్, మధుసూదన్ లు పాల్గొన్నారు.