02-11-2025 10:32:27 PM
చేగుంట: మెదక్ జిల్లా చేగుంట మండల పరిధిలోని వడియారం గ్రామ శివారులో జాతీయ రహదారి 44 బైపాస్ వద్ద ఒక గుర్తు తెలియని మగ వ్యక్తి(50) శవం సాయంత్రం ఐదు గంటలకు కనుగొనబడిందని చేగుంట ఎస్ఐ శ్రీ చైతన్య కుమార్ రెడ్డి తెలిపారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. ఇతన్ని ఎవరైనా గుర్తుపడితే స్థానిక పోలీస్ స్టేషన్ లో తెలపాలని కోరారు.