calender_icon.png 14 August, 2025 | 2:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతుకు, సైనికునికి శిక్షణ ఇచ్చేది ఉపాధ్యాయుడే!

14-08-2025 12:08:19 AM

  1. తూప్రాన్ గురుకుల హాస్టల్ లో టీఎల్‌ఎం సమావేశం

ముఖ్య అతిథులుగా జెడ్పి సీఈవో, డిఇఓ, ఆర్డీవో, డీఎస్పీ హాజరు 

తూప్రాన్, ఆగస్టు 13 : దేశంలో ఒక సైనికునికి శిక్షణ, రైతుకు అధునాతన వ్యవసాయ పద్ధతిని నేర్పేది ఉపాధ్యాయులే అని మండల విద్యాధికారి పార్వతి సత్యనారాయణ తెలిపారు. వైద్యశాఖ ఆధ్వర్యంలో బుధవారం తూప్రాన్ లోని సమీకృత బాలుర వసతి గృహంలో టి.యల్.ఎమ్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జెడ్పి సీఈవో, డిఇఓ, ఆర్డీవో, డిఎస్పి,హాజరై గ్రామాల వారీగా ఉపాధ్యాయులు ఏర్పాటు చేసిన టీచర్ లెర్నింగ్ మెటీరియల్ ను ప్రత్యేకంగా వీక్షించారు.

ఈ సమావేశాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ ప్రథమంగా విద్యను అభ్యసించే చిన్నారులు, విద్యార్థులు ముందుగా అమ్మని ఆదర్శంగా తీసుకోవాలని, అమ్మను మించిన అధ్యాపకులు ఎవరు లేరన్నారు. తర్వాత స్థానం పాఠశాలలో ఉపాధ్యాయులదేనన్నారు, విద్యార్థులు తాము సొసైటీలో ఏదైనా సాధించారంటే దానికి ముఖ్య కారణం ఉపాధ్యాయులేనన్నారు. ఇలాంటి శిక్షణతో ఉపాధ్యాయులు మెలకువలు పొందాలన్నారు,

అంతేకాకుండా క్రమశిక్షణ, విధేయత, పెద్దలపట్ల గౌరవాన్ని నేర్పించేది ఉపాధ్యాయులేనని తెలిపారు. ముఖ్యంగా దేశ అభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషించేది అధికారు లేనన్నారు. ఎంఈఓ పార్వతి సత్యనారాయణ మాట్లాడుతూ మారుమూల గ్రామంలో దేవాలయం, చర్చి, మసీదు ఉండకపోవచ్చు గానీ ఆ ఊరిలో ఒక బడి మాత్రం ఉంటుందని తెలిపారు. తల్లిదండ్రులు వారి గ్రామాలలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను చేర్పించితే ఉన్నత విద్య అభ్యసించి దేశానికి ఉపయోగపడే యువతగా తయారు కావడం జరుగుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో డీఎస్పీ నరేందర్ గౌడ్, వైద్య అధికారి అమీర్ సింగ్, ఎస్‌ఐ శివానందం, ఎంపీడీవో, హాస్టల్ వార్డెన్, మండలంలోని గురుకుల ప్రధానోపాధ్యాయులు, అధ్యాపకులు పాల్గొని విజయవంతంచేశారు.