10 April, 2026 | 7:26 AM

435 డాక్టర్ పోస్టులు భర్తీకి గ్రీన్‌సిగ్నల్

29-06-2024 12:16 AM

హైదరాబాద్, జూన్ 28 (విజయక్రాంతి) : రాష్ట్రంలో 435 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి మెడికల్ అండ్ హెల్త్ రిక్రూట్‌మెంట్ బోర్డు నోటిఫికేషన్ జారీ చేసింది. డీపీహెచ్ అండ్ ఎఫ్‌డబ్ల్యూ, డీఎంఈ విభాగాల్లో 431 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో మల్టీ జోన్  270, మల్టీజోన్- 161 పోస్టులు ఉన్నాయి. ఐపీఎం విభాగంలో 4 పోస్టులకు.. మల్టీజోన్- 1, మల్టీజోన్- 3 పోస్టులను భర్తీ చేయనున్నారు. జూలై 2 నుంచి 11వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. డీపీహెచ్‌ఎఫ్‌డబ్ల్యూ, డీఎంఈ విభాగం పోస్టులకు ఎంబీబీఎస్ తప్పక చదివిఉండాలి. ఐపీఎం విభాగం పోస్టులకు తెలంగాణ మెడికల్ కౌన్సిల్‌లో కచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి.

అరులైన అభ్యర్థులు రూ. 500 రుసుము చెల్లించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు సమర్పించాలి. ఇక ప్రాసెసింగ్ ఫీజు కింద రూ.120 చెల్లించాలి. దరఖాస్తు సమయంలో ఆధార్ కార్డు, టెన్త్ మెమో, ఎంబీబీఎస్ కన్సాలిడేటెడ్ మార్క్స్ మెమో, ఎంబీబీఎస్ సర్టిఫికెట్, తెలంగాణ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికెట్స్, 1 నుంచి 7వ తరగతి వరకు బోనఫైడ్ సర్టిఫికెట్స్, కుల ధ్రువీకరణ పత్రం, నాన్ క్రీమిలేయర్ సర్టిఫికెట్, ఇన్‌కం సర్టిఫికెట్ తప్పనిసరిగా ఉంచుకోవాలి. పూర్తి వివరాలకు వైద్య ఆరోగ్య శాఖ శాఖ రిక్రూట్‌మెంట్ బోర్డు వెబ్‌సైట్ https://mhsrb.telangana.gov.in/ ను సంప్రదించవచ్చు.