07-07-2025 01:24:50 AM
- ఎల్పీజీ, సీఎన్జీ, ఈవీలకు అనుమతి
హైదరాబాద్, జూలై 6 (విజయక్రాంతి): నగరంలో పెరుగుతున్న వాహన కాలుష్యాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా పెట్రోల్, డీజిల్ ఆటోల కొనుగోళ్లకు అనుమతిని నిరాకరిస్తూ.. ఎల్పీ జీ, సీఎన్జీ, ఎలక్ట్రిక్ ఆటోలకు అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఔటర్ రింగ్ రోడ్డు లోపల నివసించే నిరుపేద కుటుంబాలకు చేయూతనివ్వాలనే ఉద్దేశంతో జీహెచ్‌ఎంసీ.. కొత్త ఎల్పీజీ, సీఎన్జీ, ఎలక్ట్రిక్ ఆటోరిక్షాలకు అనుమతిస్తూ జీవో 263ను విడుదల చేసిం ది. రవాణా శాఖ కమిషనర్ సురేంద్రమోహ న్ దానికి సంబంధించిన మార్గదర్శకాలను ఆదివారం విడుదల చేశారు. కొత్త ఆటో రిక్షా రిజిస్ట్రేషన్ కోసం డీలర్ వద్ద నమోదు చేసుకునేందుకు కొత్త సాఫ్ట్‌వేర్ రూపకల్పన చేసి అందుబాటులోకి తెచ్చినట్టు తెలిపారు. ఆటో కొనుగోలు కోసం సోమవారం నుంచి రా ష్ర్టంలో ఏ ఆటో డీలర్ వద్దనైనా సంప్రదించవచ్చని తెలిపారు.
ఇవీ నిబంధనలు
ఆటో లైసెన్స్, ఓఆర్‌ఆర్ లోపలే నివసిస్తున్నట్లుగా లైసెన్స్‌లో చిరునామా, ఆధార్ కా ర్డు, ఓటర్ కార్డ్, బ్యాంక్ పాస్‌బుక్, కరెంట్ బిల్లు సమర్పించాలి. ఒక డ్రైవర్‌కు ఒక్క ఆటో మాత్రమే ఇస్తారు. ఇంతకుముందే సదరు ఆటోడ్రైవర్ పేరిట ఆటో ఉంటే వారు అనర్హులు. తన పేరిట ఇంకొక ఆటో లేదని ధ్రు వీకరణ అఫిడవిట్ ఇవ్వడం తప్పనిసరి. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీసు పద్ధతిలో అప్రూవల్ ఇస్తా రు. అప్రూవల్ అయిన 60 రోజుల్లోగా ఆటో ను సదరు రవాణా శాఖ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. లేదంటే సద రు ఆటో పర్మిషన్ రద్దవుతుంది.
డీలర్‌కు సూచనలు
తన వద్దకు వచ్చిన పత్రాలు క్షుణ్ణంగా పరిశీలించి, ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉన్న దరఖాస్తులను మాత్రమే లాగిన్‌లో నమోదు చేయాలి. ఆ తర్వాత డీలర్ అవసరమైన ప త్రాలను పోర్టల్‌లో అప్లోడ్ చేయాలి. వివరా లు ఆన్‌లైన్ ద్వారా ఏ కార్యాలయానికి పంపి తే అక్కడి అధికారులు పరిశీలించి 24 గంటల్లోగా అప్రూవల్ లేదా తిరస్కరిస్తారు. వాహ నం వాస్తవ ధర కంటే ఎక్కువకు అమ్మడం, ప్రాసెసింగ్ కోసమని అదనంగా డబ్బులు వసూలు చేయడం, బ్లాక్ మార్కెట్ చేయడం, బ్లాక్ చేయడం, రిజిస్ట్రేషన్ ఫీజులు వసూలు చేయడం లాంటి ఇతర ఫిర్యాదులు వస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటారు.