15-08-2025 12:00:00 AM
దేశమా నీకు ఇదే వందనం
స్వాతంత్రమా నీకు వందనం
ఈ దేశం నాది అని ప్రతి పౌరుడి గుండెలు నిండాలి
ప్రతి పౌరుడు సైనికులై మెలగాలి!!
మూడు రంగుల జెండా మురిసిపోవాలి
భారతీయులంతా కలసి రావాలి
స్వాతంత్ర దినోత్సవ సంబరాలలో
మన దేశ ఖ్యాతి దిగంతాలు దాటాలె!!!
నాటి నేతల స్ఫూర్తిని పునికి పుచ్చుకోవాలి
అభివృద్ధి బాటలో అడుగులు వేయాలి
భారతావని గుండెల్లో వెలుగులు నింపాలి
విజ్ఞాన గనిగా నింగిని తాకాలి
నా భారతదేశం!!!
దేవులపల్లి రమేశ్, నంగునూర్, సిద్దిపేట జిల్లా
సెల్: 9963701294