25-11-2025 09:24:07 PM
మార్కెట్ ముందు విక్రయాలు చేయకుండా పోలీసుల చర్యలు..
గజ్వేల్: ములుగు మండలం వంటిమామిడి కూరగాయల మార్కెట్ వద్ద ట్రాఫిక్ సమస్యలు పరిష్కారమయ్యాయి. సిద్దిపేట పోలీస్ కమిషనర్ విజయ్ కుమార్ ఆదేశాలు మేరకు స్థానిక పోలీసులు మార్కెట్ కమిటీ ప్రాంగణంలో చర్యలు చేపట్టారు. ములుగు ఎస్సై రఘుపతి ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది ఉదయం నుండే మార్కెట్ ముందు రైతులు వ్యాపారులు నిలబడకుండా చర్యలు చేపట్టారు. ఎప్పటికప్పుడు మార్కెట్కు వస్తున్న రైతులను, వ్యాపారులను రాజు రహదారి వద్ద నిలబడకుండా మార్కెట్లోనికి పంపుతున్నారు. దీంతో రాజు రహదారిపై వెళ్తున్న వాహనదారులకు మార్కెట్ వద్ద ట్రాఫిక్ సమస్య తప్పింది. ట్రాఫిక్ నివారణకు చేపట్టిన చర్యలను రూరల్ సిఐ మహేందర్ రెడ్డి పరిశీలించారు. మరికొద్ది రోజుల్లో రైతు మార్కెట్ ను ప్రభుత్వం కేటాయించిన స్థలం లోకి మార్చనున్నట్లు వంటిమామిడి మార్కెట్ కమిటీ కార్యదర్శి రేవంత్ తెలిపారు.