24-10-2025 01:08:09 AM
పాల్గొన్న సుడా చైర్మన్
కొత్తపల్లి,అక్టోబర్23(విజయక్రాంతి): కొత్తపల్లి హవేలీ లో ఇందిరమ్మ ఇళ్ల భూమి పూజలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పాల్గొన్నారు.కొత్తపల్లిలో మొత్తం 181 ఇళ్లు మంజూరు కాగా15 ఇళ్లకు నరేందర్ రెడ్డి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు.
ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లా డుతూ ఇంకా మిగిలిపోయిన అర్హులకు కూ డా మంజూరు చేస్తామని స్థానిక నాయకులు వెంటనే మిగిలిపోయిన లబ్ధిదారుల జాబితా తయారు చేసి సంభందిత పత్రాలు ఇవ్వాలని సూచించారు.అర్హులైన చివరి లబ్ధిదారు ని వరకు పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం అని నరేందర్ రెడ్డి పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ దిలీప్ కుమార్, వార్డ్ ఆఫీసర్లు, అబ్దుల్ అలీ, నర్సయ్య,గడ్డం శ్రీనివాస్, దుబ్బసి కుమార్,చిల్క హనుమత్ రెడ్డి,ఎర్రం కనకరెడ్డి,యస్వడా రాజు,జేరిపోతుల వాసు, కుతటి శ్రీనివాస్, చింతల శ్రీనివాస్ రెడ్డి, బూసా వీరు తదితరులు పాల్గొన్నారు.