calender_icon.png 25 October, 2025 | 10:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజన్న ఆలయంలో ఇన్‌చార్జి కలెక్టర్ పూజలు

24-10-2025 01:09:39 AM

  1. స్వస్తి వాచకంతో స్వాగతం పలికిన అర్చకులు

నాగిరెడ్డి అద్దాల మంటపంలో ఆశీర్వాదం అందజేత

వేములవాడ టౌన్, అక్టోబర్ 23 (విజయ క్రాంతి):వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వా మి ఆలయంలో ఇన్‌చార్జి కలెక్టర్ గరిమా అ గ్రవాల్ ప్రత్యేక పూజలు చేశారు. జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన అ నంతరం వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు వెళ్లగా, ఆలయ అర్చకులు స్వస్తి వాచకంతో స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా ఇన్‌చార్జి కలెక్టర్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. అ నంతరం నాగిరెడ్డి మండపంలో వారికి అర్చకులు ఆశీర్వచనం అందజేశారు. ఇన్‌చార్జి కలెక్టర్ దంపతులకు ఆలయ ఏఈవో బ్రహ్మన్న శ్రీనివాస్ స్వామివారి, అమ్మవార్ల శేష వస్త్రాలు, లడ్డూ ప్రసాదం అందజేశారు.కార్యక్రమంలో తహసీల్దార్ విజయ ప్రకాష్ రావు ఆలయ అధికారులు తదితరులుఉన్నారు.