3 July, 2026 | 9:20 AM

గ్రౌండ్స్‌మెన్‌కు రివార్డులు

28-05-2024 01:45 AM

న్యూఢిల్లీ: ఐపీఎల్ సీజన్ ముగిసింది. ఈ సీజన్‌లో మ్యాచ్‌లు సాఫీగా సాగడంలో తెర వెనుక కీలకపాత్ర పోషించిన గ్రౌండ్స్‌మెన్, క్యురేటర్‌లను సోమవారం బీసీసీఐ ప్రత్యేకంగా సత్కరించింది. మ్యాచ్‌లు జరిగిన 10 ప్రధాన వేదికల్లో పిచ్‌లను బాగా రూపొందించినందుకు గానూ  టోకెన్ ఆఫ్ అప్రిషియేషన్ కింద క్యురేటర్, గ్రౌండ్స్‌మెన్‌కు రూ.25 లక్షల నజరానా అందించింది. అదనంగా ఉన్న మరో మూడు వేదికలకు ప్రత్యేక ప్రోత్సాహకం కింద రూ. 10 లక్షలు అందించింది.