29 August, 2026 | 12:32 PM

Breaking News

స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే పోచారం   •   ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించిన కాంగ్రెస్ నాయకులు   •   క్రీడలతో యువతలో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ పెంపొందుతుంది   •   మహానగరంలో గంజాయి చాక్లెట్ల కలకలం.. 5 వేలకు పైగా సీజ్   •   కుల గణన శాస్త్రీయంగా జరగాలి   •   మంత్రి పర్యటనకు చురుకుగా ఏర్పాట్లు   •   45వ సబ్ జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‎ను ప్రారంభం   •   బాలల హక్కులపై అవగాహన.. ఇబ్బందులు ఉంటే ఫోన్ కాల్ తో పరిష్కారం   •   బీచుపల్లి వద్ద ఎన్‌హెచ్-44పై రోడ్డుప్రమాదం.. తప్పిన పెనుప్రమాదం   •   పెద్దమ్మ గుడిలో విషాదం.. ప్రాణం తీసిన కొత్త కారు   •  

పారా అథ్లెట్లపై ప్రధాని ప్రశంసలు

28-05-2024 01:41 AM

న్యూఢిల్లీ: భారత పారా అథ్లెట్లపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంశల జల్లు కురిపించారు. ఇటీవల జపాన్ వేదికగా జరిగిన వరల్డ్ పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో 17 పతకాలతో మన అథ్లెట్లు సత్తా చాటారు. పారా అథ్లెట్లు సాధించిన ఈ విజయం అత్యంత గొప్పదని మోదీ కొనియాడారు. పారా అథ్లెట్ల ప్రదర్శనపై ప్రధాని మోదీ సోమవారం సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. ‘ప్రపంచ పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో మన అథ్లెట్ల ప్రదర్శన అద్భుతం. ఈసారి చాంపియన్‌షిప్‌లో రికార్డు స్థాయి లో 17 పతకాలు కొల్లగొట్టి దేశ ఖ్యాతిని మరింత పెంచారు. ఇంతటి గొప్ప విజయం వెనుక ప్రతి పారా అథ్లెట్ కృషి, కఠోరశ్రమ దాగుంది’ అని మోదీ పేర్కొన్నారు. కాగా వరల్డ్ పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో 17 పతకాలు కైవసం చేసుకోగా ఇందులో ఆరు స్వర్ణాలు ఉన్నాయి.