calender_icon.png 19 May, 2025 | 5:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్లే ఆఫ్స్‌కు గుజరాత్, పంజాబ్

19-05-2025 01:18:43 AM

ఆర్సీబీకీ ఖరారయిన ప్లేఆఫ్స్ బెర్తు 

న్యూఢిల్లీ, మే 18: డబుల్ హెడర్‌లో భాగంగా జరిగిన మ్యాచ్‌లలో పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ విజయాలు సాధించాయి. ఆదివారం మ్యాచ్‌ల ఫలితంతో మూడు జట్లకు ప్లే ఆఫ్ బెర్తులు ఖరారయ్యాయి.

పాయింట్ల పట్టికలో ఉన్న గుజరాత్ టైటాన్స్, రెండో ప్లేస్‌లో ఉన్న ఆర్సీబీ, మూడో స్థానంలో కొనసాగుతున్న పంజాబ్ కింగ్స్ జట్లు ప్లే ఆఫ్స్‌కు చేరుకున్నాయి. ఇక నాలుగో స్థానం కోసం ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు పోటీ పడుతున్నాయి. మరి ఈ మూడు జట్లలో ప్లే ఆఫ్ బెర్తును ఎవరు ఖరారు చేసుకుంటారో.. 

దంచికొట్టిన పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, ఢిల్లీ

డబుల్ హెడర్ మ్యాచ్‌లలో నాలుగు జట్లూ పరుగుల వరద పారించాయి. మొద టి మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేయగా.. 220 పరుగుల ఛేదన తో బరిలోకి దిగిన రాజస్థాన్ 7 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసి విజయానికి పది పరుగుల దూరంలో నిలిచిపోయింది.

రెండో మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 3 వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసింది. 200 పరుగుల లక్ష్యంతో ఛేదనకు దిగిన గుజరాత్ వికెట్లేమీ కోల్పోకుండా 205 పరుగులు చేసి విజయం సాధించింది. పది వికెట్ల తేడాతో ఓడిపోవడం ఢిల్లీకిది మూడోసారి.