18-05-2025 12:00:00 AM
హైదరాబాద్, మే 17 (విజయక్రాంతి): దేశంలోని ప్రతిష్ఠాత్మక ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష ఆదివారం జరగనుంది. ఈ పరీక్షకు తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 40 వేల మందికిపైగా హాజరు కానున్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఆధ్వర్యంలో జాతీయస్థాయిలో నిర్వహించే ఈ పరీక్షకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు.
ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేప ర్--1, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పేపర్--2 నిర్వహించనున్నా రు. తెలంగాణలో ఆదిలాబాద్, హై దరాబాద్, కరీంనగర్, ఖమ్మం, కొత్తగూడెం, సత్తుపల్లి, మహబూబ్ నగర్, నల్లగొండ, కోదాడ, సూర్యాపేట, నిజామాబాద్, సిద్దిపేట, వరం గల్‌లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక ఏపీలో 25 పరీక్షా కేం ద్రాలను ఏర్పాటు చేశారు.
అయితే పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తమవెంట తెచ్చుకొనే వస్తువులపై నిషేధం విధించారు. ఈ పరీక్షకు డిజిటల్ వాచ్‌లే కాకుండా అనలాగ్ వాచ్‌లు, హ్యాండ్‌బ్యాగ్‌లు, పర్సులను కూడా అనుమతించరు. విద్యా ర్థులు చెప్పులు, శాండిల్స్ మాత్రమే ధరించాలి. ఉంగరాలు, చెవిపోగులు, హెయిర్ పిన్నులు, ముక్కు పుల్లలు, నెక్లెస్, చైన్‌లు, బ్యాడ్జీలను ధరించి వస్తే లోనికి అనుమతించరు. అడ్మిట్ కార్డుపై పేరెంట్ లేదా గార్డియన్ సంతకం ఉండాలి.