20-05-2025 02:14:52 AM
హాజరుకానున్న 43,615 మంది విద్యార్థులు
హైదరాబాద్, మే 19 (విజయక్రాంతి): డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ (డీఈఈసెట్)--2025ను ఈ నెల 25న నివర్వ హించనున్నారు. రెండు సెషన్‌లలో ఈ పరీక్ష జరగనుంది. తెలుగు మీడియం అభ్యర్థులకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నారు. గంటన్నర ముందుగానే పరీక్షా కేంద్రా ల్లోనికి అనుమతిస్తారు.
అయితే పరీక్ష సమయానికి 15 నిమిషాల ముందే అంటే 9.45/2.45 గంటలకు గేట్లు మూసివేయనున్నారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు హాల్‌టికెట్‌తోపాటు ఒరిజినల్ గు ర్తింపు కార్డును తమవెంట తెచ్చుకోవాలని అధికారులు సూచించారు. మొత్తం దరఖాస్తులు 43,615 వచ్చినట్లు అధికారులు తెలిపారు.