calender_icon.png 11 September, 2025 | 6:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గుకేశ్ అదుర్స్

09-12-2024 12:00:00 AM

 ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ 11వ రౌండ్‌లో లిరెన్‌పై విజయం

సింగపూర్: ప్రతిష్ఠాత్మక ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ వరుస డ్రాలకు పరంపర పలికాడు. ఆదివారం జరిగిన 11వ గేమ్‌లో గుకేశ్ చైనా గ్రాండ్‌మాస్టర్ డింగ్ లిరెన్‌పై విజయం సాధించాడు. ప్రస్తుతం గుకేశ్ 6 తో లిరెన్‌పై ఆధిక్యంలో నిలిచాడు. తద్వారా టోర్నీలో రెండో విజయం నమోదు చేసుకున్న గుకేశ్ టైటిల్‌కు మరో 1.5 పాయింట్ల దూరంలో నిలిచాడు. తెల్లపావులతో బరిలోకి దిగిన గుకేశ్ 29 ఎత్తుల వద్ద లిరెన్‌ను చిత్తు చేసి గెలుపు దక్కించుకున్నాడు.

మూడో గేమ్ అనంతరం వరుసగా ఏడు గేమ్‌లు పాటు డ్రాల పర్వం కొనసాగింది. శనివారం జరిగిన పదో గేమ్ కూడా డ్రాగా ముగియడంతో ఇరువురు ఆటగాళ్లు 5 సమంగా నిలిచారు. 11వ గేమ్ కూడా డ్రాగా ముగుస్తుందా అన్న తరుణంలో గుకేశ్ విజృంభించి లిరెన్‌నో ఓడించి గేమ్‌ను సొంతం చేసుకొని టైటిల్‌కు దగ్గరయ్యాడు. మరో మూడు గేమ్‌లు మిగిలి ఉన్న నేపథ్యంలో అన్నింటిని డ్రా చేసుకుంటేగుకేశ్ ఖాతాలో 7.5 పాయింట్లతో చాంపియన్‌గా నిలిచే అవకాశముంది. లిరెన్ ఒక్క గేమ్ గెలిచి మిగతా రెండు డ్రా అయితే విజేత ఎవరో తేల్చడానికి మరో గేమ్‌ను నిర్వహించనున్నారు.

భారత్ తరఫున చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ ఐదుసార్లు ప్రపంచ చెస్ చాంపియన్‌గా నిలిచాడు. ఈసారి గుకేశ్ టైటిల్ నెగ్గితే ఈ ఘనత సాధించిన రెండో భారత గ్రాండ్‌మాస్టర్‌గా చరిత్రకెక్కనున్నాడు.