calender_icon.png 11 September, 2025 | 3:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పింక్ బాల్ టెస్టులో భారత్ పరాజయం

08-12-2024 02:30:34 PM

అడిలైడ్ రెండో టెస్టులో భారత్ పై 10 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించింది. భారత్-ఆస్ట్రేలియా రెండో టెస్టు మూడో రోజే ముగిసింది. తొలి ఇన్నింగ్స్ లో భారత్ 180, ఆస్ట్రేలియా 337 చేసింది. రెండో ఇన్నింగ్స్ లో భారత్ 175 ఆల్ ఔట్ అయి ఆస్ట్రేలియాకు 19 పరుగుల టార్గెట్ ఇచ్చింది. స్వల్ప లక్ష్యంతో భరిలోకి దిగిన ఆసీస్ బ్యాటర్లు లక్ష్యాన్ని చేధించి ఐదు టెస్టుల సిరీస్ లో 1-1తో భారత్-ఆస్ట్రేలియా సమం చేశారు. మ్యాచ్ ఒడిపోవడంతో టాప్ ర్యాంక్ లో ఉన్న భారత్ డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో 57.29 శాతంతో మూడోస్థానానికి  పడిపోగా, పాయింట్ల పట్టికలో 60.71 శాతంతో ఆస్ట్రేలియా అగ్రస్థానానికి చేరుకుంది. దక్షిణాఫ్రికా 59.26 శాతంతో రెండో స్థానంలో ఉంది.