calender_icon.png 10 November, 2025 | 9:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సౌదీలో 2034 ఫిఫా ప్రపంచకప్

12-12-2024 12:00:00 AM

జురిచ్: ప్రతిష్ఠాత్మక ఫిఫా ప్రపంచ కప్ 2034కు సౌదీ అరేబియా వేదిక కానుంది. ఈ మేరకు బుధవారం అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య అసోసియేషన్ (ఫిఫా) అధికారిక ప్రకటన చేసింది. టోర్నీ హక్కు ల కోసం 200 ఫిఫా మెంబర్ ఫెడరేషన్స్ దాఖలు చేయగా.. సౌదీ అరేబియాకు ఆతిథ్య హక్కులు దక్కాయి.

దాదాపు 15 నెలల పాటు బిడ్‌ల ప్రక్రియ చేపట్టి చివకు సౌదీ అరేబియాకు అప్పగించినట్లు ఫిఫా అధ్యక్షుడు గియాన్ని ఇన్ఫాయాంటినో తెలిపారు. ఇక 2030 ఫిఫా ప్రపంచకప్‌కు స్పెయిన్, పోర్చుగల్, మొరాకో సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి. 2026లో జరగనున్న ఫుట్‌బాల్ ప్రపంచకప్‌కు అమెరికా, కెనడా, మెక్సికో ఆతిథ్యమివ్వనున్న సంగతి తెలిసిందే. 2021లో ఖతార్ వేదికగా జరిగిన ఫిఫా ప్రపంచకప్‌లో అర్జెంటీనా విశ్వవిజేతగా అవతరించింది.