calender_icon.png 11 July, 2025 | 3:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీసీ కెమెరాల ఏర్పాటు అభినందనీయం

10-07-2025 07:45:29 PM

చిలుకూరు: చిలుకూరు మండలం జెర్రిపోతుల గూడెం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మౌలానా మైబుబి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ షేక్ మధునా బేగం పాఠశాలలో గురువారం నాలుగు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయటం అభినందనీయమని పాఠశాల ప్రధానోపాధ్యాయులు సైదయ్య అన్నారు. ఆయన మాట్లాడుతూ.. స్కూలు పరిసర ప్రాంతాలలో ఎలాంటి అసంఘిక కార్యక్రమాలు జరగకుండా రాత్రి వేళలో దొంగతనాలు అలాంటి వాటికి ఎవరైనా పాలు పడితే సీసీ కెమెరాలు ఎల్లప్పుడూ నిగా ఉంటాయని, ఒక్క సీసీ కెమెరా 100, మందితో సమానమని ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి గ్రామంలో పెద్దలు ముందుకు రావాలని అన్నారు. అలాగే ట్రస్ట్ చైర్మన్ ని గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులు అభినందించారు.

ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి రెడ్డిపల్లి వెంకటేశ్వర్లు, ప్రాథమిక పాఠశాల హెచ్ఎం నాగేశ్వరరావు, ఉపాధ్యాయులు ధనమూర్తి, పి, ఈ,టి,శ్రీనివాస్, పాఠశాల  ఉపాధ్యాయులు,పాఠశాల చైర్మన్ సాగరిక, మహిళా సంఘం నాయకురాలు నిర్మల, గౌసియా బేగం, గ్రామ పెద్దలు కోటయ్య, మురళి, మహేష్, జానీ పాషా,నాగరాజు, నవీన్, జమాల్, తదితరులు పాల్గొన్నారు.