calender_icon.png 6 September, 2025 | 2:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్టెమ్‌స్పార్క్ రెజొనెన్స్ స్కూల్‌లో గురు పూజోత్సవం

06-09-2025 12:16:57 AM

ఖమ్మం, సెప్టెంబర్ 5 (విజయక్రాంతి): ఖమ్మం నగరంలోని శ్రీనగర్ రెజొనెన్స్ స్కూల్‌లో సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఘనంగా టీచర్స్‌డే వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డైరెక్టర్ కొండా శ్రీధర్‌రావు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రప టానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఆదిమానవుల కాలం నుండి ఆధునిక కాలం వరకు ఉపాధ్యాయుడి పట్ల గౌరవం పెరుగుతూనే ఉందని, కాబట్టి ప్రతీ ఉపాధ్యాయుడు తమ బాధ్యతను నిస్వార్ధంగా నిర్వర్తించాలని కోరారు.

విద్యార్థులు తమ జీవితానికి మార్గదర్శకులైన గురువులను మరువరాదని, గురువుల పట్ల భక్తిశ్రద్ధలతో మెలగాలని ఆయన కోరారు. రెజొనెన్స్ స్కూల్ శ్రీనగర్ విద్యార్థిని, విద్యార్థులను ఉత్తమ భావిభారత పౌరులుగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తోందన్నారు. అనుభవ జ్ఞులెన ఉత్తమ ఉపాధ్యాయుల ద్వారా చక్కటి ప్రణాళికతో ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. స్కూల్ డెరెక్టర్ కొండా కృష్ణవేణి మాట్లాడుతూ సంస్కృతీ, సంప్రదాయాల్లో గురువుకు అత్యున్నత స్థానం ఉందని తెలిపారు.

గొప్ప తత్వవేత్తగా పేరుపొంది భారత ప్రథమ పౌరుడిగా సేవలందించిన డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ మనదేశంలోనే కాదు ప్రపంచదేశాల్లోనూ తన ప్రతిభను చాటి, భారతదేశ గొప్పదనాన్ని చాటిచెప్పారని కొనియాడారు. జ్ఞాన సమాజ నిర్మాతలైనా ఉపాధ్యాయులందరికీ అభినందలు తెలియజేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ పీవీఆర్ మురళీమోహన్, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బంది పాల్గొన్నారు.