calender_icon.png 11 July, 2025 | 2:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైభావంగా గురుపౌర్ణమి

10-07-2025 05:04:41 PM

భక్తులతో కిటకిటలాడిన సాయిబాబా ఆలయాలు..

ఖమ్మం (విజయక్రాంతి): గురుపౌర్ణమి సందర్భంగా గురువారం వేకువజాము నుంచి ఖమ్మం జిల్లాలోని వివిధ సాయిబాబా ఆలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. ఖమ్మంలోని మధురానగర్ కాలనీలో గల సాయిబాబా ఆలయం(Sai Baba Temple)లో ఉదయం 6 గంటలకు బాబావారికి హారతి, 6.30 గంటల నుండి పంచామృతాభిషేకం, అన్నాభిషేకం, పుష్పాభిషేకం భక్తి ప్రపత్తులతో నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. మధ్యాహ్నం ఇమ్మడి గోపాల రావు, నాగలక్ష్మిచే మహా అన్నప్రసాద వితరణ(నారాయణ సేవ) నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో డిసిసిబి మాజీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, 14 డివిజన్ కార్పొరేటర్ కూరాకుల వలరాజు, ఆలయ కమిటీ అధ్యక్షుడు, కోశాధికారి పల్లంరాజు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అదేవిధంగా ఖమ్మంలోని బ్యాంక్ కాలనీలో గల సాయిబాబా ఆలయంలో, గాంధీ చౌక్ లోని సాయిబాబా ఆలయంలో, బైపాస్ లోని సాయిబాబా ఆలయంలో, కవి రాజు నగర్ లోని సాయిబాబా ఆలయంలో, వైరాలోని సాయిబాబా ఆలయంలో, మధిరలోని సాయిబాబా ఆలయంలో, వివిధ ప్రాంతాల్లోని సాయిబాబా ఆలయాల్లో వేకువ జాము నుంచి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించి అన్నదానం చేశారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.