calender_icon.png 10 July, 2025 | 11:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం

10-07-2025 05:11:39 PM

జిల్లా టీమ్ లీడర్ పల్లెల లక్ష్మణ్..

మోతె: మహిళలను అభివృద్ధి చేయడం ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ సాంస్కృతిక సారధి జిల్లా టీమ్ లీడర్ పల్లెల లక్ష్మణ్(District Team Leader Palle Laxman) అన్నారు. గురువారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఇందిర మహిళ శక్తి సంబరాలు జులై 9 నుంచి 11వ తేదీ వరకు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు డి ఆర్ డిఏ ఆధ్వర్యంలో జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి పర్యవేక్షణలో జిల్లాలోని 23 మండలలో ప్రతి గ్రామంలో మహిళా శక్తి పైన అవగాహన కల్పించడం జరుగుతుందని పల్లెల లక్ష్మణ్ చెప్పారు. స్వయం సహాయక గ్రూప్ కు చెందిన ప్రతి ఒక్కరు తాము ఎంపిక చేసుకున్న యూనిట్ తో ఉపాధి అవకాశాలు పొంది ఆర్థికంగా అభివృద్ధి చేయడం కోసమే ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలియ జేశారు.

ఇప్పటికే తీసుకున్న రుణాలకు సంబంధించి నేరుగా బ్యాంకులో చెల్లింపులు చేయాలని మధ్యవర్తులకు ఏ లాంటి డబ్బులు లావాదేవీలు చేయ వద్దని కోరారు. తీసుకున్న రుణం వాయిదాల పద్ధతిలో క్రమం తప్పకుండా చెల్లించడంతో ప్రభుత్వం అందించే సబ్సిడి లు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏ  పి యం వెంకయ్య, సిసి రామ కృష్ణ, విబికే లు మంగమ్మ, మహేశ్వరి, తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు  గంట భిక్ష పతి, పల్లెల రాము, కుందమల్లనాగ లక్ష్మీ, మల్లమ్మ, గ్రామ మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.