calender_icon.png 8 May, 2025 | 9:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘గుస్సాడీ’ కనకరాజును ఆదర్శంగా తీసుకోవాలి

08-05-2025 12:00:00 AM

గుస్సాడి కార్యశాల ముగింపు ఉత్సవాల్లో కలెక్టర్ రాజర్షి షా 

ఆదిలాబాద్, మే 7(విజయక్రాంతి): గుడిహత్నూరు మండలం శంభుగూడలో ఏర్పా టు చేసిన తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ , ఆదివాసీ సకల కళా సంక్షేమ సంఘం సంయుక్తంగా ఆదివాసీ కళల పరిరక్షణలో భాగంగా గుస్సాడీ కార్యశాల ము గింపు ఉత్సవాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్‌లు ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా సాంస్కృతిక కార్యక్రమాలను ఆకట్టుకునేలా కళాకారులు ప్రదర్శించారు. అనంతరం కలెక్టర్, ఎస్పీలు విద్యార్థులను, వివిధ రంగాల కళాకారులను శాలువాలతో సన్మానించి జ్ఞాపికను అందజేశారు. ఈ మేరకు కలెక్టర్ మాట్లాడుతూ... తమ సంప్రదాయాలను తమ వరకే పరిమితం కాకుండా భావితరాలకు అందించాలని, వారు సైతం కళ రంగం లో రాణించాలని అన్నారు.

గుస్సాడీ నృత్యానికి వన్నె తెచ్చిన కనకరాజు పద్మశ్రీ అవార్డు అందుకున్నారని, ఆయన బాటలో యువత నడవాలని పిలుపునిచ్చారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, సమ్మర్ క్యాంపులో పాల్గొనాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కుంరం నాగరావ్ పటేల్, కాత్లె భీమ్రావు, మహజాన్ కాత్లె భరత్, మేడి గంగారం పటేల్, శంభు, మాజీ సర్పంచ్ మర్సకొల తిరుపతి పాల్గొన్నారు.