08-05-2025 12:00:00 AM
కుమ్రం భీం ఆసిఫాబాద్, మే7 (విజయక్రాంతి): క్రీడాభివృద్ధికి తనవంతుగా పూర్తి సహకారం ఉంటుందని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. ఇటీవల ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జరిగిన 38వ జాతీయ స్థాయి సీనియర్ నెట్ బాల్ క్రీడా పోటీల్లో ప్రతిభ కనబరిచిన కీర్తన, దీప్తిలతో పాటు ఎస్‌జీఎఫ్ నేషనల్ జూనియర్ క్రీడా పోటీల్లో ప్రతిభ కనబరిచిన సాయి దీక్ష, అర్చన, సంజనను బుధవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద ఘనం గా శాలువాతో సన్మానించి అభినందించా రు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మి మాట్లాడుతూ చదువుతోపాటు క్రీడల్లోనూ రాణిం చాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో క్రీడలకు ప్రత్యేక రిజర్వేషన్ ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నెట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు, సింగి ల్ విండో చైర్మన్ అలీ బిన్ హైమద్, డివైఎస్‌ఓ రమాదేవి, నాయకులు నీసార్, రాజేశ్వ ర్ తదితరులు పాల్గొన్నారు.
ఉన్నత లక్ష్యాలను ఎంచుకోవాలి
ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని వాటి సాధ న కోసం కృషి చేయాలని ఎమ్మెల్యే కోవలక్ష్మి అన్నారు. బుధవారం తన నివాసం వద్ద ఇటీవల పదవ తరగతి ఫలితాల్లో ప్రతి భ కనబరిచిన గిరిజన పాఠశాలల విద్యార్థులను, విద్యను అందించిన ఉపాధ్యాయుల ను సన్మానించారు.
ఈ సందర్భంగా ఎమ్మె ల్యే మాట్లాడుతూ ఆదివాసీ గిరిజనులు విద్య పై దృష్టి సారించాలని తెలిపారు. విద్యతోనే ఉన్నత భవిష్యత్తును ఏర్పాటు చేసుకోవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన శాఖ డిడి రమాదేవి, ఎస్‌సిఎం ఓ ఉద్ధవ్, జిసిడి ఓ శకుంతల తదితరులు పాల్గొన్నారు.
సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ: -
అనారోగ్య సమస్యలతో ప్రైవేట్ ఆస్పత్రి లో ఉంది ఆర్థిక సాయం కోసం సీఎం సహాయనిధి కి దరఖాస్తు చేసుకున్న బాధితులకు మంజూరైన చెక్కులను బుధవారం ఎమ్మెల్యే తన నివాసంలో అందజేశారు. పేద ప్రజల కు సీఎంఆర్‌ఎఫ్ పథకం ఆర్థికంగా సహా యం అందించడం జరుగుతుందన్నారు.