19-08-2025 10:39:51 PM
కొండపాక: మర్పడగ గ్రామంలోని విజయదుర్గా సామెత సంతాన మల్లికార్జున స్వామి క్షేత్రంలో మంగళవారం అర్ధ మహోత్సవను వైభవంగా నిర్వహించారు. క్షేత్ర నిర్వాహకులు చెప్పాలా హరినాధ శర్మ ఆధ్వర్యంలో ఉదయం 6 గంటల నుంచి గణపతి పూజతో ప్రారంభించి, సంతాన మల్లికార్జున స్వామికి, సంతాన పాశుపతి అభిషేకం, శ్రీ విజయ దుర్గ మాతకు విశేష పూజలు నిర్వహించారు. అనంతరం సంతాన పాశుపతి హావనం పూర్ణాహుతి నిర్వహించారు. మోహన కృష్ణ శర్మ మోహన కృష్ణ శర్మ, వేదవ్యాశర్మ, లక్ష్మణరావు లు వేదిక కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం అన్న ప్రసాద వితరణ నిర్వహించారు.