19-08-2025 10:43:21 PM
మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లాలో ప్రఖ్యాతిగాంచిన కురవి శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవస్థానంలోని 17 హుండీలను మంగళవారం తెరిచి లెక్కించారు. స్వామి వారి హుండీ ఆదాయం రూ.48,48,078 లభించగా, అమ్మవారి హుండీ ఆదాయం రూ.15,29,748 లభించింది.
మొత్తంగా రూ.63,77,826 హుండీల ద్వారా ఆదాయం సమకూరినట్లు ఆలయ కమిటీ చైర్మన్ కోర్ను రవీందర్ రెడ్డి, ఈవో సంజీవరెడ్డి తెలిపారు. హుండీల లెక్కింపు కార్యక్రమంలో ధర్మకర్తలు బాలగాని శ్రీనివాస్ చిన్నం గణేష్, శక్రు నాయక్, ఉప్పలయ్య, జనార్దన్ రెడ్డి, సోమ్లా నాయక్, వెంపటి శ్రీను, లక్ష్మి శ్రీనివాస సేవా ట్రస్ట్ మహబూబాబాద్, శ్రీ దుర్గా శివ సాయి సేవా ట్రస్ట్, శ్రీవారి ట్రస్ట్ సభ్యులు 210 మంది పాల్గొన్నారు.