17-03-2025 12:40:54 AM
బీజేపీఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి
హైదరాబాద్, మార్చి 16 (విజయక్రాంతి): రెండోసారి ముఖ్యమంత్రి అవుతానని అంటున్న రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు హాఫ్ టర్మ్ కూడా కొనసాగరని బీజేపీఎల్పీ నేత ఏలేటి మహే శ్వర్‌రెడ్డి అన్నారు. మంత్రులు ఆయ న్ను ప్రశాంతంగా ఉండనీయడం లేదనేది అర్థమవుతోందన్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య డూప్ ఫైటింగ్ నడుస్తోందని, దుబాయ్ గుట్టు ఎందుకు బయటపెట్టడం లేదని ఆయన నిలదీశారు.
ఆదివారం ఆయన బీజేఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ ప్రతిష్ఠను కాపాడేందు కు పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్‌గా మీనాక్షినటరాజన్ కసరత్తు చేస్తున్నారని తెలిపారు. మీనాక్షినటరాజన్ ఇచ్చే నివేదిక మేరకు మరి కొద్ది నేల ల్లో సీఎం మార్పు ఖాయమన్నారు.
కాళేశ్వర్ంట, ధరణి పోర్టల్, మిషన్ భగీరథ, విద్యుత్‌కొనుగోలు ఒప్పందాలు, ఫోన్ ట్యాపింగ్ వంటి కేసులను సీబీఐ విచారణకు ఇవ్వకుండా సర్కార్ వాటిని నీరుగార్చేందుకు ప్రయత్నిస్తోందన్నారు. కేసీఆర్ తరహాలో రేవంత్‌రెడ్డి మారాడని ఆయన విమర్శించారు. మంత్రులు, ఆయన పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకోవాలన్నారు. అసెంబ్లీలో రెండున్నర గంటల పాటు ఏకాపాత్రాభినయాన్ని వహించారని మహేశ్వర్‌రెడ్డి వ్యాఖ్యానించారు.