07-08-2025 11:11:44 PM
గజ్వేల్: సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో గురువారం అంతర్జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా గజ్వేల్ పట్టణంలోని చేనేత సహకార సంఘం ముందు నేతన్న విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అంజిరెడ్డి(MLC Anji Reddy) మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలలో నేతన్నలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వం మోడీ ప్రభుత్వం అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలు వినియోగించుకోవాలని కోరారు. డిసిసి అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పద్మశాలి సంఘం ఫంక్షన్ హాల్ కు సంబంధించి సిసి రోడ్ నిర్మాణానికి 25 లక్షల రూపాయలు ప్రభుత్వనిధుల నుంచి ఇస్తానని హామీ ఇచ్చారు.
అవసరం అనుకుంటే రేపు సిసి రోడ్డు పనులు ప్రారంభించుకోవాలని ముందు మొదటి విడతగా రూ.15 లక్షల రూపాయలను మంజూరు చేయిస్తామన్నారు. బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ యాదవ రెడ్డి మాజీ ఎంపీసీ చైర్మన్ ప్రతాపరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి లు మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ తరఫున పద్మశాలి లకు మొట్టమొదట ఫంక్షన్ హాల్ మంజూరు చేసింది కేసీఆరే అన్నారు. అప్పుడు కోటి రూపాయలు మంజూరు చేయడం జరిగిందని ఆ ఫంక్షన్ హాల్ ఇంకా పూర్తి కావడానికి కొంత ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాటిని త్వరలో మా వంతు సహకారం అందిస్తామన్నారు. పద్మశాలి సంఘం అధ్యక్షుడు దేవులపల్లి రాజారామ్, యువజన సంఘం అధ్యక్షులు తలకొక్కుల ప్రేమ్ కుమార్ లు విగ్రహ ఏర్పాటుకు కృషి చేసిన పద్మశాలి యువతకు కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో తెలంగాణ పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వల్లకాటి రాజకుమార్. రాష్ట్ర గౌరవ అధ్యక్షులు బూర మల్లేశం. సిద్దిపేట జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడు కస్తూరి సతీష్ లు పాల్గొని ప్రసంగించారు. కార్యక్రమంలో తల కొక్కుల రాజు రాష్ట్ర ఆర్చరీ చైర్మన్. ఏఎంసీ చైర్మన్ నరేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, మాజీ మున్సి చైర్మన్ లు భాస్కర్, రాజమౌళి, సంఘం మాజీ అధ్యక్షులు దుర్గాప్రసాద్ గాడి పల్లి శ్రీనివాస్. మాజీ ఏఎంసి చైర్మన్ మాదాసు శ్రీనివాస్ రాష్ట్ర నాయకులు బాలచంద్ర రాజేశం మరియు పద్మశాలి పెద్దలు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.