calender_icon.png 8 August, 2025 | 1:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా కృషి చేసిన ప్రొఫెసర్ జయశంకర్

07-08-2025 11:14:45 PM

నిరుద్యోగులను విస్మరించిన మంత్రి వివేక్..

స్థానిక ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలి..

బిఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, బిఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్..

పట్టణంలో ప్రొఫెసర్  జయశంకర్ విగ్రహం ఆవిష్కరణ..

మందమర్రి (విజయక్రాంతి): తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించడానికి ప్రొఫెసర్ జయశంకర్ విశేష కృషి చేశారని, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి దిశా నిర్దేశం చేస్తూ, తెలంగాణ ఆవిర్భావా నికి, రాష్ట్ర అభివృద్ధికి తన జీవితకాలం సేవలు అందించారని బిఆర్ఎస్ ఎమ్మెల్సీ, కవి దేశపతి శ్రీనివాస్, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(BRS Party State General Secretary RS Praveen Kumar), చెన్నూరు మాజీ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్(BRS District President Balka Suman)లు అన్నారు. గురువారం పట్టణంలోని పాత బస్టాండ్ చౌరస్తాలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని వారు ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా బిఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ, తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమాల్లో తన వంతు పాత్ర పోషించి, ప్రజా చైతన్యానికి విశేష కృషి చేసిన తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ తెలంగాణ ప్రజల గుండెల్లో సదా స్మరణీయుడని తెలిపారు. చిన్నతనం నుండి ప్రశ్నించడం అలవాటుగా చేసుకుని, తెలంగాణ ప్రజల హక్కులను కాపాడేందుకు, నీరు, నిధులు, నియామకా లలో అసమానతలు తొలగించేందుకు, ప్రజలను చైతన్య పరిచేందుకు అనేక పుస్తకాలు రచించారని, తన రచనలతో గ్రామ గ్రామాన తెలంగాణ వాదాన్ని తీసుకెళ్లడంలో ఆయన ఎంతగానో కృషి చేశారన్నారు. బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మాట్లాడుతూ, బిఆర్ఎస్ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులను కాంగ్రెస్ పార్టీ, స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి వివేక్ ప్రారంభోత్సవాలు చేస్తూ, అభివృద్ధి పనులు చేస్తున్నామని చాటింపు వేసుకుంటున్నారని ఆరోపించారు.

నిరుపేదలకు దక్కాల్సిన ఇందిరమ్మ ఇళ్ళను కాంగ్రెస్ పార్టీ నాయకులు వారి కుటుంబ సభ్యులకు, కమీషన్ ఇచ్చిన వారికి కేటాయిస్తున్నార న్నారు. సింగరేణి కార్మికుల కుటుంబాలను కాపాడాలని, కారుణ్య నియామకాలు తిరిగి కేసీఆర్ ప్రభుత్వం తీసుకువస్తే, కాంగ్రెస్ ప్రభుత్వంలో డబ్బులు చెల్లించిన వారిని అన్ఫిట్ చేస్తూ, ఉద్యోగాలు ఇస్తున్నారని ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ఎన్నికల సమయంలో 45,000 ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించి, అధికారం చేపట్టిన తర్వాత నిరుద్యోగులను విస్మరించి, తన కుమారునికి ఎంపీ కొలువు, అన్న కు ఎమ్మెల్యే కొలువు, తనకు మంత్రి ఉద్యోగాలు సంపాదించారని ఎద్దేవా చేశారు.

రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. బిఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, 1995లో ఐపీఎస్ సెలెక్ట్ అయ్యి డిఎస్పి హోదాలో తొలిసారిగా బెల్లంపల్లి, మందమర్రి ఏరియాలో విధులు నిర్వహించానని గుర్తు చేశారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతంగా ఉన్న కోల్ బెల్ట్ ఏరియాలోని కుటుంబాలతో తనకు విడదీయలేని బంధం ఉందని తెలిపారు. నూతనంగా విధులు చేపట్టిన తనకు ఈ ప్రాంతంలోని సీఐ, ఎస్ఐ ల నుండి విధులు ఎలా నిర్వ హించాలో నేర్చుకున్నాన న్నారు.  కేసీఆర్ కు నమ్మిన బంటుగా ఉంటూ, చెన్నూరు నియోజకవర్గానికి వేల కోట్ల రూపాయల నిధులు తీసుకువచ్చి, అభివృద్ధి చేసిన ఘనత బాల్క సుమన్ సొంతమని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక బిఆర్ఎస్, టిబిజికేఎస్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.