07-08-2025 11:09:12 PM
ఏరియా జిఎం జి దేవేందర్..
మందమర్రి (విజయక్రాంతి): సింగరేణి యాజమాన్యం ఆధ్వర్యంలో ఏరియాలో నిర్వహించు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో ఎలాంటి లోటు పాట్లు లేకుండా ఘనంగా నిర్వహించాలని ఏరియా జిఎం జి దేవేందర్(Area GM G Devender) సూచించారు. గురువారం జిఎం కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిఎం మాట్లాడుతూ, జిఎం కార్యాలయంలో నిర్వహించే వేడుకలకు సంబంధించిన పనులను సంబంధిత అధికారులు సమర్ధవంతంగా పూర్తి చేయాలని, ఎలాంటి లోటు పాట్లు లేకుండా చూడాలని సూచించారు. వేడుకల్లో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు, ఉత్తమ ఉద్యోగులకు సన్మానాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమాలకు అధికారులు, ఉద్యోగులు యూనియన్ నాయకులు అధిక సంఖ్యలో హాజరై, విజయవంతం చేయాలన్నారు. ఈ సమావేశంలో ఏరియా ఎస్ఓటు జిఎం విజయ ప్రసాద్, పర్సనల్ మేనేజర్ ఎస్ శ్యాంసుందర్, సివిల్ డిజిఎం రాము, వర్క్ షాప్ డిజిఎం దూప్ సింగ్, ఐఈడీ ఎస్ఈ కిరణ్ కుమార్, అధికారులు పాల్గొన్నారు.