07-08-2025 11:23:43 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) కేసముద్రం పట్టణ పరిధిలోని అమీనాపురంలో గురువారం అంగన్వాడీ కేంద్రాల్లో తల్లిపాల వారోత్సవాలు, సామూహిక అక్షరాభ్యాసం, శ్రీమంతం కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డిసిసి ఉపాధ్యక్షుడు అంబటి మహేందర్ రెడ్డి చిన్నారుల చేత ఓనమాలు దిద్దించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తల్లిపాలు బిడ్డకు ఎంతో శ్రేష్టమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాతా శిశు సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తుందని చెప్పారు. ప్రభుత్వం అంగన్వాడీ సెంటర్ల ద్వారా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ ప్రేమ జ్యోతి, మున్సిపల్ వార్డు ఆఫీసర్ ప్రభాకర్, ఎంహెచ్ఎల్పి ప్రత్యూష, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, ఏఎన్ఎం, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.